telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స్పెయిన్ లో దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాను : శ్రియ

sreya

కరోనా పీడిత దేశాల్లో ప్రస్తుతం స్పెయిన్ రెండో స్థానంలో ఉందంటే అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అక్కడ ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు 1.7 లక్షలుపైగా నమోదయ్యాయి. అలాగే, 17వేలకు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి దేశంలో ప్రస్తుతం శ్రియ ఉన్నారు. అంతేకాదు, తన భర్త ఆండ్రీ కొశ్చీవ్‌కు కరోనా లక్షణాలు కనిపించడంతో చాలా కంగారు పడ్డారట. ప్రస్తుతం తామిద్దరం వేర్వేరు గదుల్లో ఉంటున్నామని చెప్పారామె. ఈ మేరకు ‘బోంబే టైమ్స్’తో ఆమె మాట్లాడారు. ‘‘బార్సిలోనాలో సుమారు నెల రోజులుగా నేను లాక్‌డౌన్‌లో ఉన్నాను. కోవిడ్-19 వచ్చిన తరవాత నా చుట్టూ పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోయాయే తలుచుకుంటేనే భయమేస్తోంది. కరోనా విజృంభన ఎక్కువగా ఉన్న దేశాల్లో ఒకటైన స్పెయిన్‌లో ఉంటూ ఈ వైరస్ వల్ల మన జీవితాలు ఎంత త్వరగా తలకిందులయ్యాయో చూస్తున్నాను.

స్పెయిన్ మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి పరిస్థితులన్నీ మారిపోయాయి. ఇంటిలో నుంచి ఒక వ్యక్తి మాత్రమే బయటికి రావడానికి అనుమతిస్తూ పోలీసులు నిబంధన పెట్టారు. అది కూడా తప్పనిసరి అయితే మాత్రమే. నిజానికి నేను, ఆండ్రీ కలిసి వెళ్తుండగా పోలీసులు మమ్మల్ని ఆపారు. కానీ, ఆయన వైట్.. నేను బ్రౌన్. దీంతో మేమిద్దం భార్యభర్తలం కాదని వారు అనుకున్నారు. మేం వేర్వేరు వ్యక్తులమని అనుకొని వదిలేశారు. ఇలాంటి భయంకర పరిస్థితుల్లో ఆండ్రీకి పొడి దగ్గు, జ్వరం వచ్చాయి. వెంటనే మేం హాస్పిటల్‌కు వెళ్లాం. డాక్టర్లు పరీక్షించి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్పారు. ‘ఒకవేళ ఈయనకు కరోనా లేకపోయినా, ఇక్కడే ఉంటే కచ్చితంగా సోకుతుంది’ అని డాక్టర్లు మాకు చెప్పారు. దీంతో ఇంటికి వెళ్లిపోయి మాకు మేం నిర్బంధంలో ఉండాలని, ఇంటి వద్దే ట్రీట్‌మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. అప్పటి నుంచి వేర్వేరు గదుల్లోనే పడుకుంటున్నాం. ఇద్దరికీ మధ్య దూరం పాటిస్తున్నాం. దేవుడి దయవల్ల ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారు. అని శ్రియ తన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Related posts