బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సల్మాన్ మేనల్లుడు అబ్దుల్లా ఖాన్ హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 38 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన, సోమవారం రాత్రి ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందతూ కన్నుమూశారు. ఈ విషయాన్ని ధృవీకరించిన సల్మాన్, “ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాము” అంటూ తన ట్విటర్ ఖాతాతో విషయాన్ని అభిమానులకు చేరవేశారు. ట్విట్టర్లో మేనల్లుడు ఫోటో షేర్ చేసిన సల్మాన్, అబ్దుల్లా మరణ వార్తను విని బోరున విలపించారు. మరోవైపు , అబ్దుల్లా మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.
Will always love you… pic.twitter.com/bz0tBbe4Ny
— Salman Khan (@BeingSalmanKhan) March 30, 2020
ఈ అగ్ర దర్శకుడిని కొట్టి థియేటర్ నుంచి తరిమేశారట…!