telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ ఆత్మహత్య : నలుగురు సభ్యులతో సిట్‌ను ఏర్పాటు చేసిన సిబిఐ

Sushanth

జూన్ 14న ముంబైలో తన నివాసం ఉంటున్న ఇంట్లోనే సుశాంత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో సుశాంత్ మృతిపై కుటుంబసభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. యితే సుశాంత్ అనుమానాస్పద మృతి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సుశాంత్ మృతి కేసును సీబీఐకు అప్పిగిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ప్రక్రియను వేగవంతం చేసింది. ఢిల్లీ నుండి సిబిఐ బృందం ముంబై పోలీసులను కలవడానికి వచ్చింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని నివేదికలను సేకరించి ఆ తరువాత దర్యాప్తు ప్రక్రియను ప్రారంభిస్తుంది. నలుగురు సభ్యులతో కూడిన సిట్‌ను సిబిఐ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసును పరిష్కరించడానికి సిబిఐ ఫోరెన్సిక్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. కేసును మరింత లోతుగా అధ్యయనం చేయడానికి సీబీఐ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనుంది. సుశాంత్ అనుమానాస్పద మృతి కేసుతో సంబంధం ఉన్న అనుమానితులందరి వాంగ్మూలాలను ఇప్పటికే సేకరించింది. ఇదిలా ఉండగా ఇటీవలే సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా ను ఈడీ విచారించింది. ఈడీ విచారణ అనంతరం రియా సుశాంత్ కుటుంబ సభ్యులపై సంచలన ఆరోపణలు చేసింది.

Related posts