telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సమంత ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… ఫాలోవర్స్ అందరికీ హగ్స్ అండ్ కిసెస్

Sam

స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు పలు రంగాల్లో సత్తా చాటుతోంది. అంతేకాదు ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటూ ఆసక్తికరమైన ఎన్నో విషయాలను పంచుకుంటోంది. ఇక ఫాలోయింగ్ పరంగా తన తోటి స్టార్ హీరోయిన్స్ ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదుగుతోంది. ఇప్పటివరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 13 మిలియన్ల (కోటి 30 లక్షలు) దాటేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది సమంత. ”13 మిలియన్స్.. నా మనసు దోచుకున్నారు. ఫాలోవర్స్ అందరికీ హగ్స్ అండ్ కిసెస్” అంటూ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది సమంత. ఇక ఈ పోస్ట్‌తో పాటు సామ్ షేర్ చేసిన తన గ్లామర్ పిక్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ‘బిగ్‌బాస్ 4’ హోస్ట్‌గా చేసి ఒక్క ఎపిసోడ్ తోనే ప్రేక్షకుల చేత భేష్ అనిపించుకుంది సామ్. అతి త్వరలో సమంత నటించిన ‘ఫ్యామిలీమెన్ 2’ వెబ్ సిరీస్ విడుదల కానుంది.

 

View this post on Instagram

 

13 million ♥️ #hugsandkisses #rockmyheart

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

Related posts