telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రామ్ చరణ్ సతీమణి గదిలో ఆ స్టార్ హీరో కూతురి ఫోటో…!

Upasana

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ సతీమణి సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. ఆరోగ్యం దగ్గరి నుంచి, తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు, భర్త రామ్‌చరణ్‌కు సంబంధించిన విషయాలు.. సినీ విశేషాలు చెబుతూ అభిమానులకు టచ్‌లో ఉంటారు. యోగా, హెల్త్ టిప్స్ చెబుతూ ఆరోగ్యం అనేది ఎంత ముఖ్యమో చెబుతారు. ఫిట్‌నెస్ విషయంలో ఆమె చాలా జాగ్రత్తగా ఉంటారు. అపోలో లైఫ్ సంస్థ అధినేతగా ఉన్న ఆమె.. యూట్యూబ్ వేదికగా ఫిట్‌నెస్ సలహాలు ఇస్తూ ఫేమస్ అయ్యారు. అలా లక్షలాది ఫాలోయర్లను సంపాదించుకున్నారు. అయితే.. ఎక్కువగా సోషల్ మీడియానే నమ్ముకున్న ఆమె.. ఇప్పుడు నిరుద్యోగులకు అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. తాజాగా ఉపాసన ఇన్‌స్టా వేదికగా సెల్ఫీని షేర్‌ చేశారు. అందులో ఆమె ఓగదిలో డ్రెస్సింగ్‌ టేబుల్‌ ఎదురుగా కూర్చొని సెల్ఫీ తీసుకున్న ఫోటోను అభిమానుల కోసం తన సోషల్ మీియా పేజీల్లో పోస్టు చేశారు. ‘నేను పర్‌ఫెక్ట్‌ కాదు కానీ, నేను ఒరిజినల్‌’ అని ఆమె పేర్కొన్నారు. అయితే ఉపాసన షేర్‌ చేసిన సెల్ఫీలో ఆసక్తికర విషయాన్ని నెటిజన్స్ గుర్తించారు. అదేమిటంటే.. మేకప్‌ టేబుల్‌పై మేకప్ కిట్ మధ్యలో ఓ అపురూపమైన ఫొటో ఫ్రేమ్‌ ఉంది. అందులో ఉపాసన, ఒక వేడుకలో మహేశ్‌ కుమార్తె సితారతో కలిసి దిగిన ఫొటోను పెట్టుకున్నారు. అప్పట్లో మహేష్ కూతురితో దిగిన ఫోటోను ఆమె ఫ్రేమ్ కట్టించుకొని మరి గదిలో పెట్టుకున్నారు. ఉపాసన షేర్‌ చేసిన ఫొటోకు అభిమానులు, సినీ ప్రముఖులు లైకులు కొడుతున్నారు. మరోవైపు నమ్రత సైతం ఈ పోస్టుకు లైక్‌ కొట్టారు. గతేడాది నారా బ్రహ్మాణి-లోకేశ్‌ల కుమారుడు దేవాన్ష్‌ బర్త్‌డే వేడుకల్లో హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్‌లో సినీ ప్రముఖులు, వారి కుటుంబసభ్యులు హాజరయ్యారు. అయితే, ఆ వేడుకకు హాజరైన మహేశ్‌ కుమార్తె సితారతో కలిసి ఉపాసన ఫొటో దిగారు. అంతేకాకుండా ‘విత్‌ మై బెస్టీ సితార’ అని ఉపాసన అప్పట్లో సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Related posts