telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

కరోనా రక్కసి దాగుడు మూతలాట

అరె రె రే…

కాలం నవ్వింది.

కరోనా కాటేసింది…

కాలుష్యం తగ్గింది

కరోనా విషం చిమ్ముతోంది..

కష్టం చేసే వాడి(రి) కి కన్నీరు

కాయాకష్టం చేయని వాడి కులుకు..

దారులన్నీ శ్వేత సౌధాలు

దప్పికలు తీరని దీనుల బ్రతుకులు..

ఆకాశం అంతా నిర్మానుష్యం

అవని అంతా ఆక్రందనల భాష్యం…

ప్రచండుడి ప్రచండ ప్రతాపం

పేద ప్రజల ఆశ నిరాశల విలాపం…

ప్రజా రక్షణే వారి ధేయం

రక్షకభటుల స్వేద జలాల నిలయం..

విష రక్కసి దాగుడు మూతలాట

వివిధ రకాల శస్త్ర చికిత్సల కుమ్ములాట..

దూరం దూరం జరుగుడు జిందగీ

దునియా మొత్తం దిగాలు ల దిల్ పతంగీ..

కడిగిందే చేతులు కడుగుడు 

కరోనా విష కోరల వైరస్ విరుగుడు….!!

 

 

Related posts