telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఉగాది : ప్లవ నామ సంవత్సరంలో కరోనా పోతుందా.. అసలు ప్లవ అంటే ఏంటి?

ఇవాళ సూర్యోదయానికి పాడ్యమి ఉంటుంది గావున ఇవాళ ఉగాది. వికారినామ సంవత్సరము(2019), పేరుకు తగినట్టుగా వికృతంగా నాట్యం చేసింది. 

శార్వరి(అంటే, చీకటి) నామ సంవత్సరం (2020) ప్రపంచాన్ని అంధకారం లోనికి నెట్టింది. ఇప్పుడు ప్లవ నామ సంవత్సరం మొదలైనది. ఇది శుభప్రదమైన సంవత్సరం. కారణం?  ప్లవ అంటే, దాటించునది అని అర్థం. 

“దుర్భిక్షాయ ప్లవ ఇతి. తతశ్శోభనే భూరితోయం…….” దుర్భరమైన ప్రతికూలతను దాటించి భూమికి శోభను చేకూరుస్తుంది అని వరాహసంహిత వివరించింది. అంటే చీకటి నుంచి వెలుగు లోకి నడిపిస్తుందని అర్థం.  వికారి, శార్వరి తమ పేర్లకు తగ్గట్టుగా నడిపించాయి గదా. మరి ప్లవ తన పేరును సార్థకం చేసుకుంటుందని ఆశించటం తర్కసహితమైన ఆలోచనయేగదా. 

ప్లవ నామ సంవత్సరం ముగియగానే “శుభకృత్”, ఆ తరువాతది ” శోభకృత్” సంవత్సరములు. పేరుకు తగ్గట్టుగా ఇవి కూడనూ మన మనసుకు సంతోషాన్ని, వికాసాన్ని కలిగిస్తాయి. అభయాన్ని ప్రసాదిస్తాయి.అందుకే, ప్లవ నామ సంవత్సరాని కి స్వాగతం, సుస్వాగతం

Related posts