అసెంబ్లీలో అధికార వైసీపీ ప్రవర్తిస్తున్న తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సభలో మందబలం చూసుకుని గర్వం ప్రదర్శిస్తున్నారని దుయ్యబట్టారు. మెజారిటీ ఉన్నది ప్రజల్ని హింసించడానికి కాదని, ప్రజా జీవితాల్ని అస్తవ్యస్తం చేయడానికి కాదని హితవు పలికారు. అసెంబ్లీలో కొవ్వెక్కిన చందంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సభలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని, స్పీకర్ ప్రవర్తన చూస్తే ఎంతో నిర్లక్ష్యంగా ఉందని అన్నారు. ఆ చేతులు ఊపడం, కూర్చోమనడం, వెళ్లిపొమ్మనడం ఓ పద్ధతి లేని వ్యవహారం అంటూ తమ్మినేని సీతారాంపై విమర్శలు చేశారుఆర్టీసీ చార్జీలను పెంచుతూ ప్రజలపై ఓ పిడుగు వేశారని విమర్శించారు. కనీసం సభ పవిత్రతను దృష్టిలో పెట్టుకుని ఓ ప్రకటన కూడా చేయలేదని విమర్శించారు. ఈ ఏడునెలల పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు.
టీడీపీ అందించిన సైకిళ్లకు వైసీపీ స్టిక్కర్లు: నారా లోకేశ్