telugu navyamedia
సినిమా వార్తలు

రవితేజ ‘ఖిలాడీ’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.

మాస్ మ‌హారాజా రవితేజ హీరోగా, మీనాక్షి చైదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటించిన చిత్రం ఖిలాడి. ‘ప్లే స్మార్ట్‌’ అన్నది ట్యాగ్‌ లైన్‌. రమేష్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఫిబ్రవరి 11న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది.

Ravi Teja-starrer 'Khiladi' Twitter Review: Netizens Give Mixed Reactions  To Action Drama

సినిమా నుంచి వచ్చిన ట్రైలర్స్, సాంగ్స్ బాగా వైరల్ అవ్వడంతో భారీ అంచనాల మధ్య ‘ఖిలాడీ’ రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

డాక్టర్‌ జయంతిలాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్, పెన్‌ స్టూడియోస్‌తో కలసి హవీష్‌ ప్రొడక్షన్‌పై సత్యనారాయణ కోనేరు నిర్మించారు. దేవీ శ్రీ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

తాజాగా ఈ సినిమా మార్చి 11న ఖిలాడీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.. ఈ సినిమా విడుదలైన నెల రోజులకి ఓటీటీలోకి వచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది.

Khiladi movie review: Ravi Teja's heist drama has no adrenaline pumping  thrills | Entertainment News,The Indian Express

‘ఈ ఆటలో ఒక్కడే కింగ్‌, ఇంకా కొద్ది రోజులే వెయిటింగ్‌, ఫుల్‌ కిక్‌తో మార్చి 11న హాట్‌స్టార్‌లో మాస్‌ మహారాజ రవితేజ సినిమా ఖిలాడీ రాబోతోంది’ అని ట్వీట్‌ ద్వారా ప్రకటించింది. దీంతో థియేటర్లలో ఈ సినిమా చూడటం మిస్‌ అయినవాళ్లు ఎంచక్కా ఇంట్లోనే ఖిలాడి చూసేయోచ్చు.

Related posts