telugu navyamedia
సినిమా వార్తలు

బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న దేవరకొండ రౌడీస్

Vijay-Devarakonda

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ చాలా రోజుల తరువాత హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. గత కొన్ని నెలలుగా “డియర్ కామ్రేడ్” సినిమాతో బిజీగా ఉన్న విజయ్ సినిమా పని ఓ కొలిక్కి రాగానే విదేశాలకు ఎగిరిపోయాడు. తన కుటుంబ సభ్యులను కూడా ఈ కుర్ర హీరో వెంటబెట్టుకొని వెళ్ళాడు. తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా మొన్నటివరకు “దొరసాని” సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా షూటింగ్ పనులను ముగించుకున్నాడు. త్వరలో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతి మాధవ్ తో ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. త్వరలో మరో రెండు ప్రాజెక్టులను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. 2020 వరకు విజయ్ మరో సినిమాను ఒకే చేసే పరిస్థితి కనిపించడం లేదు. దేవరకొండ పేరెంట్స్ తో పాటు నిర్మాత యాష్ రంగినేని ఫ్యామిలీ కూడా ఈ ట్రిప్ కి వెళ్లారు.

Related posts