నిఖిల్ సోలో హీరోగా చాలా సినిమాల్లో నటించినా స్వామిరారా, కార్తికేయ వంటి సినిమాలు నిఖిల్ ను టాలీవుడ్ లో నిలబెట్టాయి. ఆ తర్వాత కిరాక్ పార్టీలో నటించిన నిఖిల్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నాడు. అందులో తనకు అద్భుతమైన హిట్ అందించిన కార్తికేయ కు సీక్వెల్ గా ‘కార్తికేయ2′ సినిమా చేస్తున్నాడు. కార్తికేయ సినిమా సూపర్ హిట్ కారణంగా రాబోతున్న ఈ సినిమా సీక్వెల్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఇందులో కూడా థ్రిల్లర్ కథాంశంతో దర్శకుడు చందు మొండేటి రూపొందించేందుకు కథను సిద్ధం చేసాడు. అయితే ఈ సినిమాల్లో మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నుండి ఓ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ నటించనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. అయితే ఈ సినిమాతో పాటు నిఖిల్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ’18 పేజెస్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో రానున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్నారు.
previous post