telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘లెవంత్ అవర్’ నుంచి తమన్నా ఫస్ట్ లుక్

Tamannah

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రస్తుతం సంపత్​ నంది, హీరో గోపించంద్‌తో తెరకెక్కిస్తున్న ‘సీటీమార్’​లో కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డి​గా నటిస్తోంది. ఇక సత్యదేవ్ తో ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రాలతో పాటు హిందీలో ‘బోల్ చుడియాన్’ చిత్రంలో కూడా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు త్వరలొ వెబ్ సిరీస్ లోకి అడుగుపెట్టనుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కోసం తమన్నా ఈ వెబ్ సిరీస్ చేస్తుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ తెలుగు వెబ్ సీరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘లెవంత్ అవర్’ అనే వెబ్ సిరీస్ లో తమన్నా నటిస్తుంది. ఇందుకు సంబందించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. మొత్తం 8 ఎపిసోడ్స్ గా ప్రసారం కాబోతున్న ఈ వెబ్ సిరీస్ లో ప్రముఖ నటీనటులను నటింపజేస్తున్నారట. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కబోతుందని తెలుస్తుంది. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న తమన్నా ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ బ్యూటీ షూటింగులతో బిజీగా ఉంది.

Related posts