telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

నెల్లూరులో … గుట్టుగా వ్యభిచారం.. అధికారుల చొరవతో..

Ap police

పోలీసులు నెల్లూరులోని వేదాయపాళెంలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచారగృహాలపై దాడులు చేసిన తొమ్మిదిమంది మహిళలకు విమక్తి కలిగించారు. వ్యభిచార గృహ నిర్వాహకులు చంద్రమ్మ, కామాక్షి, లావణ్యలను అదుపులోకి తీసుకున్నారు. వేదాయపాళెంలో గత కొంతకాలంగా జోరుగా వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం మేరకు నిఘా పెట్టామని ఇన్‌చార్జ్ డీఎస్పీ మరియదాసు తెలిపారు.

పక్కా సమాచారంతో వృభిచార గృహాలపై దాడిచేసినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గృహ నిర్వాహకులతోపాటు ఆరుగురు విటులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు.

Related posts