telugu navyamedia
సినిమా వార్తలు

పెళ్లి సందDలో మరో రొమాంటిక్ సాంగ్ రిలీజ్..

శ్రీకాంత్ తనయుడు రోష‌న్ హీరోగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోనంకీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం పెళ్లి సందD. గత 25 ఏళ్ల క్రితం ‘పెళ్లి సందడి’ సినిమా ఎంత పెద్ద రికార్డులు సాధించిందో అంద‌రికి తెలిసిందే. రోషన్‌ మరియు శ్రీ లేఖ హీరో హీరోయిన్లు న‌టించిన‌ ఈ చిత్రంతో దర్శకేంద్రుడు ఓ ప్రత్యేక మైన పాత్ర‌లో క‌నువిందు చేయ‌నున్నారు.

Pelli Sandadi 2 HD Photos | Roshan Pelli Sandadi HD Photos - Sakshi

రొమాంటిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‏టైనర్‏గా తెరకెక్కిన ఈ పెళ్లి సందD సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్‌ మంచి రెస్పాన్స్ అందుకున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మరో రొమాంటిక్ సాంగ్ మేక‌ర్స్ రిలీజ్‌ చేశారు. పెళ్లి సందD’ సినిమాలోని ‘గంధర్వ లోకాల’ అంటూ సాగే మరో రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ దసరా కానుగా అక్టోబర్ 15న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

మహేష్ బాబు చేతులు మీదుగా పెళ్లిసందD ట్రైలర్ రిలీజ్? - Telugu Mahesh Babu Pelli Sandadi Raghvedra Rao Roshan Srikanth Tollywood Trailer Released-Telugu Trending Latest News Updates-TeluguStop

ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, రాజీవ్ కనకాల, హేమ, ప్రగతి కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కె. కృష్ణమోహన్ రావు సమర్పణలో ఆర్.కె. ఫిలిం అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్స్ మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Related posts