ఇండియా కరోనా వైరస్‌కి విరుగుడుగా వ్యాక్సిన్ వేసే కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రధాని మోడీ 10:30 కి వర్చువల్ విధానంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 3006 ప్రదేశాల్లో ఒకేసారి వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు ఒక్కో కేంద్రంలో 100 మందికి టీకాలు ఇస్తున్నారు. తొలిదశలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య, ఐసీడీఎస్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ, వ్యాక్సిన్‌పై ఇతర సందేహాల నివృత్తి కోసం కేంద్రం ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. అయితే… వ్యాక్సిన్ ప్రారంభం సందర్భంగా ప్రధాని మోడీ వ్యాక్సిన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోందని.. వ్యాక్సిన్ రూపకల్పనకు శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు కష్టపడ్డారని పేర్కొన్నారు మోడీ. శాస్త్రవేత్తల కృషికి ఫలితంగా రెండు వ్యాక్సిన్లు వచ్చాయని… మరికొన్ని అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. దేశీయ వ్యాక్సిన్ ద్వారా భారత్ తన సత్తాను ప్రపంచానికి చాటిందన్నారు. తక్కువ సమయంలోనే మనకు టీకా వచ్చిందని తెలిపారు. అంతేకాదు.. వ్యాక్సిన్ పంపిణీ ఖర్చంతా కేంద్రానిదేనని స్పష్టం చేశారు మోడీ.
previous post
next post