telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఒక మొసలి కి .. గుడి… ఎక్కడో తెలుసా..

temple to a crocodile in

దేశంలో ఎన్నో గుడులు ఉన్నాయి, అయితే ఒక మొసలికి గుడి ఉన్నట్టు ఎక్కడా వినుండము కదా. అలాంటి సందర్భం ఒకటి జరిగింది, అదేమంటే, ఓ మొసలి మరణం ఆ గ్రామాన్ని విషాదంలో ముంచెత్తింది. ఊరంతా కదిలొచ్చి దానికి అంత్యక్రియలు జరిపింది. రోజంతా ఆ గ్రామస్థులు భోజనం చేయలేదు. ఆ మొసలికి గుడి కట్టాలని కూడా యోచిస్తున్నారు. ఆ మొసలితో ఆ పల్లెకు ఎందుకంత బంధం పెనవేసుకుందనేది ఆసక్తికరం. ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతారా జిల్లాలో బవా మొహ్‌తారా గ్రామంలోని చెరువులో వందేళ్లకు పైగా ఓ మొసలి నివాసం ఉంటోంది.

దేవుడి తర్వాత తమను ఆ మొసలి రక్షిస్తోందన్నది గ్రామస్థుల విశ్వాసం. దానికి గంగారామ్‌ అని పేరుపెట్టుకుని దశాబ్దాల తరబడి పూజలు చేస్తూ వస్తున్నారు. 3.4 మీటర్ల పొడవు, 250 కిలోల బరువుండే ఆ మొసలి చనిపోయి ఉండటాన్ని మంగళవారం గ్రామస్థులు గుర్తించారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. దాదాపు 500 మంది చెరువు వద్దకు చేరుకుని చనిపోయిన మొసలిని భక్తితో తాకి, అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. చెరువు ఒడ్డున స్మారక ప్రాంతం ఏర్పాటు చేయడానికి నిర్ణయించినట్లు సర్పంచి సాహు తెలిపారు.

Related posts