telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘డర్టీ అజిత్ ఫ్యాన్స్’ సీనియర్ నటి సోషల్ వార్

ajith

చెన్నైకి చెందిన కస్తూరికి తెలుగులో ‘అన్నమయ్య’ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. గత కొద్ది రోజులుగా తమిళ స్టార్ హీరో అజిత్ ఫ్యాన్స్‌కు, కస్తూరికి మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. ఆ మధ్య అజిత్ ఫ్యాన్‌గా ట్విట్టర్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకున్న సదరు వ్యక్తి.. కస్తూరిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో కస్తూరికి కోపం వచ్చి ట్విట్టర్‌లోనే చెడామడా వాయించేశారు. ‘మనిషికో మాట.. గొడ్డుకో దెబ్బ అంటారు. కానీ, ఇలా అజిత్ అభిమానినని చెప్పుకుంటూ ఆడవాళ్ల మీద నీచమైన కామెంట్స్ చేసే ఇలాంటి వాళ్లని ఏమనాలి మీకు అమ్మాయిలు సెక్స్ కోసమే కావాలంటే.. బయటకి వెళ్లడం ఎందుకు? ఇంట్లో మీ అక్కనో, అమ్మనో అడగండి’ అని ఘాటుగా ట్విట్టర్‌లో రిప్లై ఇచ్చారు. అంతేకాకుండా ‘డర్టీ అజిత్ ఫ్యాన్స్’ అనే హ్యాష్‌ట్యాగ్ కూడా పెట్టారు. దీంతో అజిత్ ఫ్యాన్స్‌కు కోపం వచ్చింది. అప్పటి నుంచి కస్తూరిని వాళ్లు టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా అజిత్ అభిమాని పేరిట ఉన్న ఓ ట్విట్టర్ అకౌంట్ నుంచి కస్తూరిపై వల్గర్ ట్వీట్ చేశారు. దీంతో ఇక అజిత్ ఫ్యాన్స్ ఆగడాలు తట్టుకోలేక కస్తూరి మరోసారి ఘాటుగా స్పందించారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చేసిన ట్వీట్స్ స్క్రీన్‌షాట్‌లను ట్వీట్ చేసిన కస్తూరి.. అహంకారంతో విర్రవీగుతోన్న తన ఫ్యాన్స్‌పై అజిత్ చర్యలు తీసుకోవాలని కోరారు. తన అభిమానులుగా చెప్పుకుంటూ ఇలా ఆడవాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తోన్నవారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అజిత్, ఆయన మేనేజర్ సురేష్ చంద్ర బొమ్మల్లా చూస్తున్నారని కస్తూరి ఆరోపించారు. ఇంకెన్నాళ్లు ఇలా నిశ్శబ్దంగా చూస్తూ ఉంటారని అజిత్‌ను ప్రశ్నించారు. ఇప్పటికైనా తన అభిమానులుగా చెప్పుకు తిరుగుతోన్న ఇలాంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అజిత్‌ను కోరారు.

Related posts