telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాగశౌర్య సరికొత్త లుక్… 20వ సినిమా కోసం ఐడియల్ మేకోవర్

Naga-Shaurya

టాలీవుడ్ కి ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. ఛలో సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఈ ఏడాది ‘అశ్వథ్థామ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. నాగశౌర్య తర్వాత సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతుంది. సుబ్రహ్మణపురం దర్శకత్వం వహించిన సంతోష్ జాగర్లపుడి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఇందులో నాగ శౌర్య కు జంటగా కేతిక శర్మ నటిస్తుంది. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. సిక్స్ ప్యాక్ తో నాగశౌర్య అదరగొట్టాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో తాజాగా కౌబాయ్ గెటప్ స్టిల్ ను సోషల్ మీడియాలోకి వదిలాడు. ఈ లుక్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నాగశౌర్య విలువిద్య నేపథ్యంలో నిర్మించే సినిమా కోసం వర్కవుట్ లు స్టార్ట్ చేసాడు. అక్కడితో ఆగకుండా ఎయిట్ ప్యాక్ ఫిట్ నెస్ సాధించాడు. ఇప్పటివరకు లవ్ లీగా కనిపించిన నాగశౌర్య తన శరీరాన్ని మరింత దృఢంగా మార్చుకొని ఫిట్ గా కనిపిస్తున్న ఈ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నాగశౌర్య ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే, మరో వైపు నిర్మాతగా కూడా బిజీ అయ్యాడు. అలాగే కొత్త దర్శకురాలు లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. నాగశౌర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Related posts