telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వర్మ “పవర్ స్టార్”పై నిఖిల్ కౌంటర్

nikhil

వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ ‘పవర్ స్టార్’ పేరుతో సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ”ఎన్నికల తర్వాత కథ” అనే ట్యాగ్ లైన్ పెట్టేసి అచ్చం పవన్ కళ్యాణ్, చిరంజీవిలను పోలిన నటులతో సెన్సేషనల్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్న వర్మను కొందరు పవన్ అభిమానులు టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ‘పరాన్నజీవి’, ‘డేరా బాబా’ అనే సినిమాలతో వర్మపై సెటైరికల్ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు హీరో ప‌వ‌న్ అభిమాని అయిన హీరో నిఖిల్ ఒక్క‌సారిగా వ‌ర్మ‌పై ఫైర్ అయ్యారు. ‘శిఖరాన్ని చూసి కుక్క ఎంత మొరిగినా.. ఆ మహా శిఖరం తల తిప్పి చూడదు. మీకు అర్థమయ్యిందిగా’ అంటూ నిఖిల్ ఆర్జీవీని తిడుతూ పోస్ట్ చేయడం గమనార్హం. మరి నిఖిల్ బాటలో ఇంకేవరైనా హీరోలు వస్తారో.. లేక కామ్‌గా చోద్యాన్ని చూస్తారో వేచి చూడాలి.

Related posts