telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రముఖ సీనియర్ నటి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్

Shabana

ఇటీవల కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ ప్రముఖ నటి షబానాఅజ్మీ కోలుకోవడంతో వైద్యులు ఆమెను డిశ్చార్జి చేశారు. ముంబై -పూణే ఎక్స్‌ప్రెస్ వేపై ఖాలాపూర్ టోల్ ప్లాజా వద్ద కారులో ఈ నెల 18 వ తేదీన ప్రయాణిస్తుండగా జరిగిన ప్రమాద ఘటనలో షబానా అజ్మీ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన షబానాను వెంటనే నవీముంబైలోని మహాత్మాగాంధీ మిషన్ మెడికల్ కళాశాల ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ముంబై నగరంలోని అంథేరి ప్రాంతంలో ఉన్న కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రికి మార్చారు. షబానాఅజ్మీ ఆసుపత్రిలో ఉన్నపుడు పలువురు సినీతారలు, సెలబ్రిటీలు వచ్చి ఆమెను పరామర్శించారు. 13 రోజుల పాటు చికిత్స అనంతరం షబానాఅజ్మీ ఆరోగ్యం మెరుగుపడటంతో వైద్యులు ఆమెను ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించారు. షబానాను కొంతకాలం ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

Related posts