telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

గృహహింస కేసులో … యువరాజ్ సింగ్‌కి ఊరట…

yuvaraj free from domestic violence case

భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కి గృహహింస కేసులో ఊరట లభించింది. యువీతో పాటు అతడి కుటుంబ సభ్యులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంది ఆకాంక్ష శర్మ. యువీ సోదరుడు జొరావర్‌సింగ్‌, ఆకాంక్ష తాజాగా కోర్టు విడాకులు మంజూరు చేయడంతో వారి మధ్య గొడవ సద్దమణిగింది. భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగ్‌కు గృహహింస కేసులో ఊరట లభించింది. అతడిపై చేసిన ఆరోపణలు, ఫిర్యాదులన్నీ అవాస్తవాలని కేసు పెట్టిన ఆకాంక్ష శర్మ అంగీకరించింది. ఈ విషయాన్ని యువీ కుటుంబ సభ్యులే చెప్పారు. దేశంలో కోట్లాది మంది ప్రేమించే యువీ పేరును దురుద్దేశ పూర్వకంగానే కేసులోకి లాగారని పేర్కొన్నారు. ఇప్పుడు యువీ ప్రశాంతంగా ఉండగలడని చెప్పారు.

యువరాజ్‌సింగ్‌ సోదరుడు జొరావర్‌ సింగ్‌ భార్య ఆకాంక్ష శర్మ. పెళ్లైన ఆర్నెల్లకే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. భర్తకి గత నాలుగేళ్లుగా దూరంగా ఉంటూ వచ్చింది ఆకాంక్ష. వాస్తవానికి తొలుత జొరావర్, యువీ తల్లి షబ్నంపైనే కేసు పెట్టింది. కానీ.. వారికి యువీ మద్దతు తెలుపుతున్నాడనే కారణంతో అతడి పేరుని కూడా గృహహింస కేసులోకి చేర్చింది. జొరావర్‌ సింగ్‌తో సహా యువీ, అతడి తల్లి షబ్నమ్‌పై 2017 అక్టోబర్‌లో గృహహింస కేసు పెట్టింది ఆకాంక్ష శర్మ. ఈ ఏడాది సెప్టెంబర్‌ మొదటి వారంలో వీరిద్దరికీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ క్రమంలో యువీ కుటుంబసభ్యులు ఒక ప్రకటన విడుదల చేశారు. చట్టం నుంచి తప్పించుకోలేనని తెలుసుకున్న ఆకాంక్ష శర్మ.. తాను చేసిన ఆరోపణలు, ఫిర్యాదులు అవాస్తవమని అంగీకరించిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. యువీ పేరును అడ్డం పెట్టుకొని తమ కుటుంబ సభ్యులను లక్ష్యంగా ఎంచుకుందని, గృహహింస కేసుతో యువీ ప్రతిష్ఠకు భంగం కలిగించిందని వాపోయారు. మొత్తంగా రెండేళ్లుగా విచారణ జరుగుతున్న కేసుకు రాజీతో ముగిసింది.

Related posts