వైసీపీ అధినేత జగన్ గుంటూరు సమీపంలోని తాడేపల్లిలో నూతనంగా నిర్మించిన ఇంటిలో నిన్న గృహప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యాలయాన్ని కూడా జగన్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జగన్ బంధువు, సినీనటుడు మంచు విష్ణు సోషల్ మీడియాలో స్పందించారు. జగన్ కు అంతా మంచి జరగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు.
మంచు విష్ణు ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘అందమైన ఇంటిలో జగన్ అన్నకు అంతా మంచే జరగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా. మీ కలలను సాకారం చేసుకునే దిశగా ఆ దేవుడు మీకు మరింత శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. జగన్ సొంత బాబాయ్ కుమార్తె అయిన వెరోనికా రెడ్డిని మంచు విష్ణు పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.