telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చిట్టి చెల్లితో రష్మిక… పిక్స్ వైరల్

rashmika

“ఛలో” సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేసులో దూసుకెళ్తోంది. విజయ్ దేవరకొండ సరసన “గీతగోవిందం” సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ.  వెండి తెరపై ఈ జంటకు తెలుగు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. దీంతో మళ్ళీ ఈ విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి “డియర్ కామ్రేడ్” చిత్రం చేశారు. రీసెంట్‌గా ‘భీష్మ’ చిత్రంతో వరస హిట్లను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో జోరు మీద ఉన్న ఈ కుక్క బిస్కెట్ల భామ “స్నాక్స్‌గా కుక్కబిస్కెట్లను తింటుందట రష్మిక” కు ఓ చిట్టి చెల్లెలు ఉంది. 24 ఏళ్ల రష్మికకు చిట్టి చెల్లెలు అంటే ఏదో రెండు మూడేళ్లు చిన్నదై ఉంటుందిలే అనుకుంటే పొరపాటే. రష్మిక కంటే 18 ఏళ్లు చిన్నదైన చిట్టిచెల్లెలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రష్మిక మందన చెల్లి పేరు శిమన్ మందన. ఆరేళ్ల వయసున్న శిమన్ మందనతో రష్మిక దిగిన ఫొటోలపై ఓ లుక్కేద్దాం.

Related posts