telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

144 కోట్లతో విలాసవంతమైన ఇంటిని కొన్న ప్రియాంక

Priyanka

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గత ఏడాది అమెరికాకు చెందిన ప్రముఖ పాప్‌సింగర్ నిక్ జొనాస్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగి… హాలీవుడ్‌లోనూ క్వాంటికో సిరీస్‌లో ప్రతిభ చాటి తనేంటో ప్రపంచానికి తెలియజేసింది. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా 2017లో వచ్చిన బేవాచ్ సినిమాతో ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందిన విష‌యం తెలిసిందే. బేవాచ్ త‌ర్వాత కూడా ప‌లు హాలీవుడ్ సినిమాలు చేసిన ఈ అమ్మ‌డు ఇటీవ‌ల “స్కై ఈజ్ పింక్” అనే హిందీ చిత్రంలో న‌టించింది. ప్ర‌స్తుతం ‘వి కెన్ బి హీరోస్’ అనే హాలీవుడ్ మూవీలో న‌టిస్తుంది. అమెరికాలోనే అత్యంత విలాస నగరంగా భావించే లాస్ ఏంజెల్స్ లో 20 వేల చ‌ద‌ర‌పు అడుగులలో నిర్మించిన‌ కొత్త ఇంటిని కొంద‌ట ప్రియాంక‌. దాని ధర $20 మిలియన్ డాలర్స్ అంటే మన కరెన్సీలో దాదాపు 144 కోట్ల రూపాయలన్న మాట. ఇందులో ఏడు ప‌డ‌క గదులు, 11 స్నాన‌పు గ‌దులు, హై సీలింగ్‌, విశాల ప్ర‌దేశం ఉంటుంద‌ట‌. నిక్ సోద‌రుడు జో జోనాస్ కూడా దాదాపు ఇలాంటి విలాసవంత‌మైన ఇల్లు గ‌తంలో కొన్నాడు. అది 15000 చ‌ద‌ర‌పు అడుగులు ఉండ‌గా, ఇందులో 10 బెడ్ రూంలు, 14 బాత్ రూంలు ఉంటాయ‌ట‌. దీని ధ‌ర $14.1మిలియన్ డాలర్స్‌. ఈ ఇంటికి ద‌గ్గ‌ర‌లోనే ప్రియాంక‌,నిక్‌లు త‌మ కొత్త ఇంటిని కొనుగోలు చేసిన‌ట్టు తెలుస్తుంది.

Related posts