telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ఆడ పిల్లల కోసం కేంద్ర పథకం… ప్రతి యేటా ఖాతాలో నగదు!

child development

ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం బాలిక సమృద్ధి యోజన పథకం ప్రవేశపెట్టింది. ఇందులో చేరడం వల్లద్వారా బాలికలకు లబ్ది చేకూరనుంది. బాలిక యోజన పథకం 1997 నుంచి అమలులో ఉంది. స్కూళ్లలో ఆడ పిల్లల సంఖ్యను పెంచడానికి ఈ స్కీమ్‌ను తీసుకువచ్చారు. ఈ పథకం కింద ఆడ పిల్ల పుట్టిన తర్వాత అమ్మకు రూ.500 క్యాష్ గిఫ్ట్‌గా ఇస్తారు. తర్వాత ఆడ పిల్ల స్కూల్‌కు వెళ్లిన దగ్గరి నుంచి ప్రతి సంవత్సరం ఉపకార వేతనం అందిస్తారు.

18 ఏళ్లు వచ్చిన తర్వాత డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. గ్రామాల్లో అంగన్‌వాడీ కార్యకర్తల దగ్గరకు వెళ్లి ఈ పథకంలో చేరొచ్చు. పట్టణాల్లో అయితే హెల్త్ ఫంక్షనరీస్ వద్ద స్కీమ్ అప్లికేషన్స్ అందుబాటులో ఉంటాయి. ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు సంవత్సరానికి రూ.300 అందజేస్తారు. తర్వాత 4వ తరగతి నుంచి రూ.500 వస్తాయి. 5వ తరగతికి రూ.600, 6 నుంచి 7వ తరగతికి రూ.700, 8వ తరగతికి రూ.800, 9వ తరగతిలో రూ.1000 అందజేస్తారు. మధ్యలో చదువు మానేసిన బాలికలకు ఈ పథకం వర్తించదు.

Related posts