రోడ్డు ప్రమాదంలో సింగర్ దుర్మరణం చెందిన ఘటన ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. మరాఠీ ప్లే బ్యాక్ సింగర్ గీతా మాలీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గురువారం రోజు తన స్వస్థలమైన నాసిక్‌కి కారులో వెళుతుండగా ముంబై-ఆగ్రా హైవేపై ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటెయినర్‌ని గీతా మాలీ కారు ఢీకొట్టగా, గీతా, ఆమె భర్త తీవ్రగాయాలపాలయ్యారు. వెంటనే వారిని షాపూర్ రూరల్ ఆసుపత్రికి తరలించారు. చికత్స పొందుతూ గీత మృతి చెందారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. గీతా మరాఠీలో పలు సినిమా పాటలతో పాటు ఆల్బమ్స్‌కి కూడా పాడింది. ఆమె మృతికి మరాఠీ సినీ పరిశ్రమ సంతాపం తెలియజేశారు.
previous post