telugu navyamedia
వార్తలు సామాజిక

పోలీసు అధికారి పై విరుచుకుపడ్డ కలెక్టర్.. సస్పెండ్ చేస్తానని వార్నింగ్

Police

కంచీలోని అత్తి వరదరాజ ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ పోలీసు వీఐపీ గేటు దగ్గరికి సాధారణ భక్తులను అనుమతించాడు. ఈ విషయాన్ని గమనించిన కాంచీపురం జిల్లా కలెక్టర్ అతని పై తిట్లవర్షం కురిపిస్తూ బెదిరించారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. ఇలా మోసం చేయడానికే డ్యూటీకి వచ్చావా? ఏం తనిఖీలు చేస్తున్నారు అని మందలించారు.

వీఐపీలు ఈ మార్గం గుండా వచ్చినపుడు ఎలాంటి విలువా లేకుండా నిలబడాలా? వీఐపీ పాస్ లేని వారిని ఎందుకు అనుమతిచ్చారు? సీనియర్ ఐపీఎస్‌లు, మంత్రులు వస్తుంటారు… నీ పని అయిపోయినట్లే… ఈరోజే నిన్ను సస్పెండ్ చేస్తున్నాను అంటూ ఒక్కసారిగా కలెక్టర్ రెచ్చిపోయారు. ఐజీ.. ఎక్కడున్నారు? వెంటనే రమ్మనండి.. ఈయనను సస్పెండ్ చేయమని చెప్పండి అని ఆదేశించారు.అయితే ఈ మొత్తం వీడియోలో ఆ పోలీసు వివరణ ఇవ్వడానికి ఎంత ప్రయత్నించినా కలెక్టర్ వినలేదు.

Related posts