దగ్గుతూ, తుమ్ముతూ ఎస్కార్ట్ పోలీసులకు మస్కా కొట్టి ఓ ఖైదీ పరారైన ఘటన తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీవైకుంఠం ప్రాంతానికి చెందిన మయాండీ, పలు దోపిడీ కేసుల్లో నిందితుడు కాగా, అతని కోసం పోలీసులు వెతుకుతూ ఉన్నారు. ఈ క్రమంలో మయాండీ మంగళవారం పట్టుబడగా, న్యాయమూర్తి ఆదేశానుసారం, తిరునల్వేలి జిల్లా పాళయం కోట్టైలోని కేంద్రకారాగారానికి తరలించే పనిలో నిమగ్నమయ్యారు.
వ్యాన్ లో ఎక్కించుకుని వెళ్తుండగా మార్గమధ్యంలో అదే పనిగా దగ్గడం, తుమ్మడం చేసిన మయాండీ, తనకు కరోనా వచ్చిందేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేశాడు. దీంతో ఆందోళన చెందిన ఎస్కార్ట్ పోలీసులు, రాత్రి ఏడు గంటల సమయంలో, పాళయం కోట్టై సమీపంలోని ఆసుపత్రికి పరీక్షల నిమిత్తం తీసుకుని వెళ్లారు.కరోనా లక్షణాలు కనిపించడంతో, పోలీసులు మయాండీకి కాస్తంత దూరంగా ఉండగా, అదే అదనని భావించి వారి కన్నుగప్పి పారిపోయాడు.
అపోజిషన్ లో ఉండటం టీడీపీకి కొత్తేమి కాదు: చంద్రబాబు