telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ప్రేయసి పెళ్ళికి ముందు ప్రియుడి మెసేజ్… షాకైన పెళ్ళి కూతురు

girl

యూకేకు చెందిన అలెక్సా సాంచెజ్ అగ్యిలార్ అనే యువతికి తన మాజీ ప్రియుడి నుంచి ట్విట్టర్ ద్వారా ఓ టెక్ట్స్ మెసెజ్ వచ్చింది. ఆ సందేశాన్ని ఆమె సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఇక అది చదివిన తనకు నోట మాట రాలేదని చెప్పింది అలెక్సా. సందేశంలో ఏముందంటే… “నీ మనస్సు చాలా మంచిది.. ఎప్పుడు నన్ను ప్రోత్సహిస్తూ, నా పట్ల ఎంతో ప్రేమతో కేరింగ్‌గా ఉన్నావు. ఇతరులతో ఎలా ప్రేమగా మెలగాలో నేర్పించావు.. అలాగే జీవితాన్ని పరిపూర్ణంగా ఎలా బ్రతకాలో చూపించావు. నీలాంటి మంచి వ్యక్తికి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. నీ వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలని.. నీవు పెళ్లి చేసుకునే వ్యక్తి నిన్ను ప్రతిరోజు ప్రేమగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. నాపై నీవు చూపిన ప్రేమకు ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చాడు.” ఈ సందేశాన్ని అలెక్సా ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ ట్వీట్‌కు సుమారు 98వేల రీట్వీట్స్ వచ్చాయి. ప్రేయసి మంచి కోరుతున్న మాజీ ప్రియుడిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Related posts