కరోనా సెకండ్ వేవ్ మన దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కల్లోలం సృష్టించింది.. ఎప్పుడూలేని విధంగా సెకండ్ వేవ్‌లో రికార్డు స్థాయిలో కేసులు వెలుగు చూశాయి.. దీంతో.. అప్రమత్తమైన ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ లాక్‌డౌన్ ప్రకటించారు.. దీంతో.. కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గుముఖం పుడుతున్నాయి.. దాదాపు నెల పదిహేను రోజుల తర్వాత ఇవాళ అత్యల్పంగా 2,260 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఏప్రిల్ 22న ఏకంగా 36 శాతంగా నమోదైన కరోనా పాజిటివిటీ రేటు.. ఇప్పుటు 3.58 శాతానికి పడిపోవడం ఊరట కల్పించే అంశం.. ఢిల్లీ సర్కార్ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 2,260 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా, 182 మంది మృతిచెందారు.. ఇదే సమయంలో 6,453 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,15,219కు చేరుకోగా.. ఇప్పటి వరకు 13,60,898 మంది కోలుకున్నారు.. 23,013 మంది కరోనాబారినపడి కన్నుమూశారు.. ప్రస్తుతం ఢిల్లీలో 31,308 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
next post