telugu navyamedia
సినిమా వార్తలు

“సిగ్గులేని వెధవ”… స్టార్ హీరో వ్యాఖ్యలు

Disha-Patani-and-Tiger-Shroff

బాలీవుడ్ లో ప్రేమ వ్యవహారాలు చాలా సాధారణం. స్టార్ హీరోలు, హీరోయిన్ల మధ్య ప్రేమకు సంబంధించిన వార్తలు తరచుగా వింటూనే ఉంటాము. అయితే సోషల్ మీడియా వల్ల సెలెబ్రిటీలు తమ అభిమానులతో టచ్ లో ఉంటూ ఉంటారు. బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన జంట టైగర్ ష్రాఫ్, దిశా పటాని. “బాగి-2″లో వీరిద్దరూ రొమాన్స్ చేశారు. ప్రస్తుతం చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ప్రేమలో మునిగి తేలుతున్నారు ఈ జంట. ఇదిలా ఉండగా టైగర్ ష్రాఫ్ అభిమానులతో ముచ్చటించేందుకు ‘ఆస్క్ మి ఎనీథింగ్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. అభిమానులంతా సరదాగా టైగర్ తో ముచ్చటిస్తున్న సమయంలో ఓ ఆకతాయి అభిమాని మాత్రం అసభ్యకరంగా ప్రశ్నించాడు. “మీరు ఇప్పటికి వర్జీనేనా?” అని ప్రశ్నించడంతో టైగర్ కు చిర్రెత్తుకొచ్చింది. “సిగ్గులేని వెధవ” అంటూ ఆ అభిమానిపై విరుచుకుపడ్డాడు. అంతేకాదు “నన్ను మా కుటుంబ సభ్యులు కూడా ఫాలో అవుతున్నారు. ఇలాంటి ప్రశ్నలేనా అడిగేది ?” అని సదరు నెటిజన్ కు బుద్ది చెప్పాడు. ఇక టైగర్ కు దిశా పటాని తో లవ్ ఎఫైర్ కు సంబంధించిన ప్రశ్నలు కూడా అభిమానుల నుంచి ఎదురయ్యాయి. మీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ అని ప్రశ్నించగా.. ఎవరూ లేరు అని సమాధానం ఇచ్చాడు. మీరు దిశాతో డేటింగ్ లో ఉన్నారా ? అని ప్రశ్నించగా.. “ఆమెతో డేటింగా.. నాకు అంత సీన్ లేదు” అని బదులిచ్చాడు. దిశా గురించి మాట్లాడడానికి టైగర్ తప్పించుకుంటున్నా.. దిశా మాత్రం పలు సందర్భాల్లో టైగర్ తో తనకున్న రిలేషన్ ని ప్రస్తావించింది.

Related posts