telugu navyamedia
సినిమా వార్తలు

మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్​లో నితిన్..

మెగాస్టార్ చిరంజీవి హీరో ఏకే ఎంటర్‌ టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘భోళా శంకర్‌’. మెహర్‌ రమేష్ దర్శ‌క‌త్వంలో తమన్నా హీరోయిన్ న‌టిస్తుండ‌గా… కీర్తిసురేష్ చెల్లెలి పాత్రలో నటిస్తోంది.

తమిళంలో విజయవంతమైన ‘వేదాలం’ ఆధారంగా రూపొందుతోంది చిత్రం. అయితే తాజాగా సినిమాకు సంబంధించి లేటేస్ట్ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ మూవీలో హీరో నితిన్​కు ఛాన్స్​ కొట్టేసినట్లు తెలుస్తోంది. చిరు చెల్లిలిగా నటిస్తున్న కీర్తి భర్త పాత్రలో నితిన్​ నటించనున్నారని టాక్‌.

వచ్చే నెలలో సెట్స్​లో అడుగుపెట్టే అవకాశం ఉంది.నితిన్ ప్ర‌స్తుతం మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో నితిన్ స‌ర‌స‌న కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

ఈ సినిమా త‌రువాత నితిన్ వ‌క్కంతం వంశీ సినిమాతో న‌టిస్తున్నాడు. ఈ గ్యాప్‌లో చిరు భోళాశంక‌ర్ సినిమాలో స్పెష‌ల్ రోల్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

త్వరలోనే భోళా శంకర్‌ రిలీజ్​ డేట్​ను ప్రకటించనున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రానికి ఏకే ఎంటర్​టైన్​మెంట్​ నిర్మిస్తోంది. రామబ్రహ్మం సుంకర నిర్మాతగా.. మహతి స్వర సాగర్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు

Related posts