కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ నిర్మిస్తున్న ‘ఆచార్య’. అయితే ఆచార్య గత షెడ్యూల్ గోదావరి ఖనిలోని మైనింగ్ ప్రాంతంలో జరిగింది. అది పూర్తి కాగానే చిత్ర యూనిట్ మొత్తం హైదరాబాద్ వచ్చేసింది. అయితే… తాజాగా ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ మళ్ళీ మొదలైంది. ఇక చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ను ఈ నెల 31న విడుదల చేయబోతున్నారు.
అయితే తాజాగా ఉగాది సందర్బంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెబుతూ…ఓ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర సభ్యులు. ఈ పోస్టర్ లో రామ్ చరణ్- పూజ హెగ్డే ఉన్నారు. చరణ్ పూజతో ఉన్న రొమాంటిక్ ఫోటోను రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఆచార్య లో తన పాత్రకు సంబందించిన షూటింగ్ ను పూర్తి చేసాడు చరణ్.
previous post