బిగ్ బాస్ సీజన్-3 ప్రారంభమై 15 మంది కంటెస్టెంట్స్‌తో ఇప్పటికే రెండు ఎలిమినేషన్స్ పూర్తయ్యాయి. తొలి వారం హేమ ఇంటి నుండి బయటకి వెళ్ళగా, రెండో వారం జాఫర్‌ని ఎలిమినేట్ చేశారు. ప్రస్తుతం హౌజ్‌లో 14 మంది సభ్యులు ఉండగా… ఈ వారం నామినేషన్‌లో ఎక్కువ ఓట్లు పొందిన తమన్నా, పునర్నవి, రాహుల్, వితికా, బాబా భాస్కర్‌లు ఎలిమినేషన్‌లో నిలిచారు. రెండో వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా షోలో అడుగుపెట్టిన ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి ఆదివారం షో నుంచి ఎలిమినేట్ అయింది. ప్రస్తుతం బిగ్ బాస్ ఆసక్తికరంగా సాగుతోంది. బయటకు వచ్చాక బిగ్ బాస్ విశేషాలని తమన్నా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. బిగ్ బాస్ షోలో ఉన్నన్ని రోజులు చాలా ఎంజాయ్ చేశానని తమన్నా తెలిపింది. తాను ఎలిమినేట్ కావడానికి కారణం ప్రజలు తనని తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే అని తమన్నా తెలిపింది. బిగ్ బాస్ అనేది ఒక గేమ్ షో. లోపలి ఎవరైనా గేమ్ ఆడేందుకే వెళతారు. రవి కృష్ణ విషయంలో తన ప్రవర్తన గేమ్ లో భాగమే అని తమన్నా తెలిపింది. కానీ అందరూ అది అర్థం చేసుకోకుండా నా క్యారెక్టర్ ని తప్పుబట్టారు. అది సరికాదు. గేమ్ లో అలా ప్రవర్తించినంత మాత్రాన నేను చెడ్డదాన్ని ఐపోతానా అని తమన్నా ప్రశ్నించింది. బిగ్ బాస్ హౌస్ లో నేను వెళ్లే సమయానికే కొన్ని గ్రూపులు ఉన్నాయి. వారంతా గ్రూపులుగా మారి నన్ను టార్గెట్ చేశారు అని తమన్నా పేర్కొంది. రవి, అలీ, రోహిణి ఒక గ్రూప్ అని తమన్నా పేర్కొంది. రవి కృష్ణని నేను తిట్టలేదు.. రెచ్చగొట్టాను అంతే. ప్రస్తుతం షోలో ఉన్నవారిలో శ్రీముఖి, బాబా భాస్కర్ అంటే తనకు ఇష్టం అని తమన్నా పేర్కొంది.
previous post
next post
నాడు 18 సీట్లు నేడు ఒక్కటి .. వర్మ ఆసక్తి కర వ్యాఖ్యలు