telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరో ప్రముఖ నటుడికి కరోనా

Aftab

ప్రముఖ నటుడు అఫ్తాబ్ శివదాసానికి తాజాగా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ లో షేర్ చేశాడు‌. ఈ మేరకు “దురదృష్టవశాత్తు ఫలితం పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం వైద్యాధికారుల పర్యవేక్షణలో ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నాను” అని ఆఫ్తాబ్ తెలిపారు. ఇటీవల తనను కలిసినవారంతా పరీక్షలు చేయించుకోవాలని అఫ్తాబ్ అభ్యర్థించారు. అఫ్తాబ్ ఇటీవల తన భార్య నిన్ దుసాంజ్ తో కలిసి ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించాడు. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. కేంద్రప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా ఉధృతి తగ్గట్లేదు. సాధారణ ప్రజలతో పాటు అధికారులు, పోలీసులు, సెలబ్రిటీలు సైతం కరోనా భారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ నటీనటులు కరోనా మహమ్మారి బారిన పడ్డ సంగతి తెలిసిందే. ఇటీవలే అర్జున్ కపూర్, అతని గర్ల్‌ఫ్రెండ్ మలైకా అరోరాకు పాజిటివ్ గా నిర్దారణ అయింది.

Related posts