telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“అవతార్” సీక్వెల్స్ కు కొత్త రిలీస్ డేట్స్

Avatar

2009లో “అవతార్” సినిమాను అద్భుతమైన గ్రాఫిక్స్‌తో మరో ప్రపంచాన్ని కళ్లకు కట్టేలా చూపించాడు హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్. దీంతో అతని పేరు వరల్డ్ వైడ్ ఒక్కసారిగా మారు మోగింది. అలాంటి అద్భుత సృష్టి అయిన అవతార్ సినిమాకు సంబంధించి సీక్వెల్స్ రూపొందుతున్న పనిలో పడ్డాడు కామెరూన్. అయితే అవతార్‌-2 సినిమాను 2021 డిసెంబర్‌ 17న విడుదల చేయనున్నట్టు ఇదివరకే జేమ్స్‌ కామెరూన్‌ ప్రకటించారు. లాక్‌డౌన్ వలన సీక్వెల్ పనులకి బ్రేక్ పడింది. ఇప్పుడిప్పుడే సడలింపులు ఇస్తుండడంతో అవతార్ సీక్వెల్ పనులు మొదలు పెట్టారు జేమ్స్ కామెరూన్‌. ‘అవతార్‌’ చిత్రం సీక్వెల్‌ షూటింగ్‌ న్యూజిలాండ్‌లో మొదలైంది. ఈ సినిమా షూటింగ్‌ కోసం దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌, ఆయన టీమ్‌ కొన్ని వారాల క్రితం న్యూజిలాండ్‌ చేరుకున్నారు. తాజాగా డిస్నీ సంస్థ అవతార్ సీక్వెల్స్‌కి సంబంధించిన రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు. అవతార్ 2 చిత్రం ముందుగా 2021 డిసెంబర్ 17న విడుదల అవుతుందని ప్రకటించారు. అవతార్‌-2తో సీక్వెల్‌ పూర్తవ్వక ముందే అవతార్‌-3, అవతార్‌-4, అవతార్ 5 సినిమాలు కూడా నిర్మించాలని కూడా భావిస్తున్నట్టు వెల్లడించారు జేమ్స్‌ కామెరూన్‌. ఇక అవతార్ 3 చిత్రం డిసెంబర్ 20, 2024న, అవతార్ 4 చిత్రం డిసెంబర్ 18, 2026న, అవతార్ 5 చిత్రం డిసెంబర్ 22, 2028న రిలీజ్ కానున్నట్టు ప్రకటించారు.

Related posts