telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పోలీసు బిడ్డగా వారికి చేతులెత్తి సెల్యూట్ చేస్తున్నాను : చిరంజీవి

chiranjeevi flight return with technical issue

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను మన దేశం నుంచి తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ వైరస్ వ్యాప్తిని ఆపాలంటే లాక్‌డౌన్ ఒక్కటే మార్గమని భావించి 21 రోజులపాటు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులో పోలీసులు మాత్రం రాత్రింబవళ్లు రోడ్లపైనే ఉంటూ ఇళ్లకు కూడా వెళ్లకుండా తమ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రోడ్లపై డ్యూటీలు చేస్తోన్న పోలీసుల ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా ఉన్నతాధికారులు సైతం వారి వద్దకు వచ్చి ధైర్యం చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం పోలీసుల కృషిని కొనియాడుతూ ఒక వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు. శుక్రవారం తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ‘‘రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల పనితీరు అద్భుతం. నిద్రహారాలు కూడా మాని వాళ్లు పడుతున్నటువంటి కష్టం అంతా ఇంతా కాదు. నేను హైదరాబాద్‌లోనే స్వయంగా చూస్తున్నాను.. వారి పనితీరు వల్ల లాక్‌డౌన్ చాలా విజయవంతంగా జరుగుతోంది. అలా జరగడం వల్లే ఈ కరోనా విజృంభన చాలా వరకు అదుపులోకి వచ్చింది. సామాన్య ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని వేడుకుంటున్నాను. ఈ కరోనాను తుదముట్టించడంలో, అంతమొందించడంలో వారికి చేదోడు వాదోడుగా మనందరం ఉండాలి.. సహకరించాలి. పోలీసు వారు చేస్తోన్న ఈ అమోఘమైన ప్రయత్నానికి పోలీసు బిడ్డగా వారికి చేతులెత్తి సెల్యూట్ చేస్తున్నాను’’ అని వీడియోలో చిరంజీవి వెల్లడించారు.

Related posts