సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగులో టాప్ హీరోలలో ఒక్కరు. అయితే ప్రస్తుతం మహేష్ పరశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా చేస్తోంది. అయితే ఈ సినిమా రెండో షెడ్యూల్ దుబాయ్ లో ప్రారంభం కాగా తాజాగా ఈ షెడ్యూల్ పూర్తిచేసుకుంది చిత్రబృందం. ఇందులో యాక్షన్ సన్నివేశాలు, మహేశ్, కీర్తిసురేష్‌ల పై కీలక సన్నివేశాలను చిత్రీకరించింది చిత్ర యూనిట్. అయితే బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశాలతో ఈ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీమేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఫ్యాన్స్‌ను అలరించేందుకు ఈ షెడ్యూల్ లోని చిన్న వీడియోను విడుదల చేయాలని ‘సర్కారు వారి పాట’ చిత్ర బృందం భావిస్తుందట. దుబాయ్ లోని అద్భుతమైన లొకేషన్స్‌తో పాటుగా మూవీ సెట్స్ చూపించబోతున్నారని తెలుస్తోంది.ఈ గిఫ్ట్స్ ఎప్పటికి వస్తాయి అనేది చూడాలి మరి.
previous post
next post
జగన్ సుపరిపాలన అందించడం ఖాయం : లక్ష్మీపార్వతి