telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

జూన్ 30 వరకు అంత‌ర్జాతీయ విమానాల‌పై నిషేధం పొడిగించిన భారత్

Air India flight

మ‌రో 30 రోజులు అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌పై నిషేధాన్ని పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది.. అంత‌ర్జాతీయ‌ కమర్షియల్, ప్యాసింజర్ విమానాలపై ఉన్న నిషేధాన్ని మ‌రో నెల‌పాటు పొడిగిస్తున్న‌ట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్ర‌క‌టించింది.. జూన్ 30వ తేదీ వరకు ఈ నిషేధం అమ‌ల్లో ఉంటుంద‌ని ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది డీజీసీఏ.. అయితే, ఈ స‌మ‌యంలో ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చే ప్ర‌త్యేక విమానాలు, అంతర్జాతీయ కార్గో ఆపరేషన్లు, విమానాలకు మాత్రం ఈ ఆంక్ష‌లు వ‌ర్తించ‌బోవు. అయితే, అంత‌ర్జాతీయ విమానాల‌పై నిషేధం విధించినా.. ప్యాసింజర్ల రాకపోకలకు ఇబ్బంది లేకుండా పలు దేశాలతో భార‌త్‌.. ద్వైపాక్షిక ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకుంది.. దీని ప్ర‌కారం.. అంతర్జాతీయ విమానాల ఆపరేషన్ జరుగుతున్న‌ది. కానీ ఇది ఎలా ఉన్నా.. క‌రోనా సెకండ్ వేవ్ నేప‌థ్యంలో.. మ‌రో 30 రోజులు అంత‌ర్జాతీయ విమానాల‌పై కేంద్రం నిషేధం పొడిగించింది .

Related posts