telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

రాజోలులో మళ్ళీ జనసేనకు పట్టం…

rigging case on rapaka varaprasad

ఏపీలో నిన్నటితో పంచైతే ఎన్నికలు ముగిసాయి. అయితే నిన్న జరిగిన చివరి విడత ఎన్నికల్లో జగన్‌కు జై కొట్టిన వరప్రసాద్‌కు జనసైనికులు ఝలక్ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో కీలక స్థానాలు గెలుచుకొని పట్టు నిలుపుకున్నారు. 10 స్థానాల్లో జనసేన మద్దతుదారులు గెలుపొందారు. మరో సారి రాజోలు ప్రజలు జనసేనకు మద్దతు పలికారు. 2019 ఎన్నికల్లో జనసేనను గెలిపించిన స్థానికులు…పంచాయతీ ఎన్నికల్లోనూ 10 స్థానాలు కట్టబెట్టారు. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీకి మద్దతు పలికినా…జనం మాత్రం జనసేనకే జై కొట్టారు. పడమటిపాలెం, కేశవదాసుపాలెం, టెకిశెట్టిపాలెం, ఈటుకూరు, మేడిచర్ల పాలెం,కాట్రేనిపాడు,రామరాజులంక, కూనవరం, కత్తిమండ, బట్టేలంకలో జనసేన మద్దతుదారులు విజయఢంకా మోగించారు.జనసేన నుంచి గెలిచి వైసీపీ టచ్‌లోకి వెళ్లిపోయిన రాపాకపై జనసేన శ్రేణులు గుర్రుగా ఉన్నారు. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న పవన్ అభిమానులు పంచాయతీ పోరులో ఊహించని షాక్ ఇచ్చారు. తమ అధినేతకు వెన్నుపోటు పొడిచిన ఎమ్మల్యేలకు తగితన గుణపాఠం చెప్పామంటున్నారు జనసేన కార్యకర్తలు. మరి దీని పై రాపాక ఏమైనా స్పందిస్తారా… లేదా అనేది చూడాలి.

Related posts