telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కరోనా చికిత్సపై డబ్ల్యూహెచ్ఓ సంచలన వ్యాఖ్యలు

who modi

కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ప్రయోగాలు చేస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ సంచలన వ్యాఖ్యలు చేసింది. కరోనా వైరస్‌ను అంతం చేసే అత్యంత అద్భుతమైన చికిత్స ఏదీ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అభిప్రాయపడింది. బహుశా అది ఎప్పటికీ రాకపోవవచ్చని అనుమానం వ్యక్తం చేసింది.

వ్యాక్సిన్ అభివృద్ధికి ప్రపంచవ్యాప్తంగా ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ సులభమైన పరిష్కారం ఏదీ ఉండకపోవచ్చని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెసియస్ అన్నారు.

చైనాలో వెలుగు చూసిన ఈ వైరస్ అక్కడది మనుషుల్లోకి ఎలా ప్రవేశించిందనే విషయంపై విచారణ చేపట్టేందుకు డబ్ల్యూహెచ్ఓ పంపిన ఇద్దరు సభ్యుల బృందం ప్రాథమిక విచారణ ముగించినట్టు తెలిపారు. వైరస్‌కు సంబంధించిన మూలాలను కనుగొనేందుకు డబ్ల్యూహెచ్ఓ నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం చైనా పరిశోధకులతో కలిసి పనిచేస్తుందని టెడ్రోస్ వెల్లడించారు.

Related posts