పెద్దపల్లి జిల్లాలో దారుణహత్యకు గురైన వామన్ రావు, నాగమణి దంపతుల కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. అయితే ఆయన పైకి కనిపించేంత మంచివాడు కాదని, వామన్ రావు కుటుంబం గుంజపడుగులో ఎన్నో అక్రమాలకు పాల్పడిందని పలువురు ఆరోపిస్తున్నారు. తాజాగా మరో మహిళ తెరపైకి వచ్చి వామన్‌రావుపై సంచలన ఆరోపణలు చేశారు. ఇరిగేషన్‌శాఖలో పనిచేసే తన భర్త వెంకటేశ్వర్లును వామన్‌రావు హత్య చేశాడని మృతుడి భార్య నల్లవెల్లి అరుణజ్యోతి ఆరోపించారు. శనివారం కరీంనగర్ ప్రెస్‌భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ 2008లో తన కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని రూ.1.50లక్షలు తీసుకుని ఉద్యోగం ఇప్పించలేదని పేర్కొన్నారు. డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు తన భర్తను కరీంనగర్ అల్గునూర్ వద్ద కిడ్నాప్ చేసి నల్గొండ జిల్లా వెలిగొండ గ్రామంలో హత్య చేసినట్లు అరుణ జ్యోతి ఆరోపించారు. హోంమంత్రి, ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారుల వద్దకు వెళ్లినా తనకు న్యాయం జరగలేదని ఆమె వాపోయారు. తన లాంటి బాధితులు చాలా మంది ఉన్నారని అరుణ జ్యోతితెలిపారు. వామన్‌రావుపై చాలా కేసులున్నాయని, పోలీసులు న్యాయం చేయాలని ఆమె కోరారు.
previous post
next post