బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినాకైఫ్ ‘కేబై కత్రినా’ పేరుతో సొంతంగా సౌందర్య ఉత్పత్తి సాధనాల బ్రాండ్‌ను ఆరంభించింది. గత ఏడాది జరిగిన ఈ బ్రాండ్ ప్రచార కార్యక్రమాల్లో నయనతార పాల్గొన్నది. దక్షిణాది సినిమాలతో బిజీగా ఉండి కూడా తన బ్రాండ్ ప్రచారంలో నయనతార పాల్గొనడం ఆనందంగా ఉందని ఆమెకు ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటానని కత్రినాకైఫ్ తెలిపింది. ఇటీవల ఓ ఇంటర్యూలో నయనతారతో పనిచేయడాన్ని గురించి కత్రినా వెల్లడిస్తూ ‘వృత్తిపట్ల నయనతార అంకితభావం, ఆమె పనిచేసే విధానం అద్భుతంగా ఉంటాయి. తనలో ఏదో తెలియని మహత్తర శక్తి ఉంది. చిన్న వయసులోనే నటనను వృత్తిగా ఎంచుకున్నది. పని గురించి స్పష్టత ఉంది. తనకు ఏం కావాలో తెలుసు. ఒక్కసారి పనిలో పడితే అమితంగా ప్రేమించి చేస్తుంది. నయనతార సెట్స్‌లో ఉంటే మన ప్రతిబింబాన్ని మనమే అద్దంలో చూసుకున్నట్లు ఉంటుంది’ అని తెలిపింది.
ఫెలైన విద్యార్థి ఏడ్చినట్టుంది చంద్రబాబు ఎడుస్తున్నాడు !