telugu navyamedia
సినిమా వార్తలు

సమంత డ్రెస్ హాట్ టాపిక్… రేటు ఎంతంటే ?

Samantha

నవ మన్మథుడు, టాలీవుడ్ “కింగ్” నాగార్జున తన 60వ పుట్టిన రోజును స్పెయిన్‌లోని ఐబిజా ఐల్యాండ్‌లో తన కుటుంబ సభ్యుల సమక్షంలో నాగ్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో నాగ్ కోడలు సమంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన హాట్ లుక్‌తో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మామ నాగార్జున బర్త్ డే సందర్భంగా సరికొత్త ఫ్యాషన్‌తో అందరినీ ఆకర్షించింది. నాగ చైతన్య, సమంత, అఖిల్, నాగార్జున, అమల..అందరూ స్పెయిన్ అందాలను ఆస్వాదిస్తున్నారు. నాగ్ బర్త్‌డేకు నాలుగు రోజుల ముందే చై-సామ్ దంపతులు స్పెయిన్ వెళ్లిపోయి ఏర్పాట్లు చేశారు. మామ పుట్టిన రోజు వేడుకల్లో పింక్ డ్రెస్‌… వన్-షోల్డర్ షిమ్మర్ డ్రెస్ ధరించి పార్టీలో సందడి చేసింది. ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. ఆ వేడుకల్లో సమంత ధరించిన డ్రెస్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సమంత డ్రెస్‌పై కొందరు ప్రశంసలు చేస్తుంటే.. మరికొందరు విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనా సమంత ధరించిన ఆ పింక్ డ్రెస్ ఖరీదు దాదాపు రెండు లక్షల రూపాయలని సమాచారం.

Related posts