telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే ?

Ananya-Pandey

క్రేజీ స్టార్ విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియన్‌ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఛార్మీ కౌర్‌, కరణ్‌ జోహార్‌తో కలిసి పూరి నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్‌ మారిందని టాక్‌. ఈ చిత్రానికి తొలుత ‘ఫైటర్‌’ టైటిల్‌ ఖాయం చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం తదితర భాషల్లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రెండు భాషల్లో ఈ టైటిల్‌ దొరకలేదట. కొన్ని అనివార్య కారణాల వలన సినిమాలో హీరో పేరు ‘లైగర్‌’ను టైటిల్‌గా ఖరారు చేశారట. ‘ఫైటర్‌’ బన్‌గయా ‘లైగర్‌’ (మగ సింహానికి, ఆడ పులికి పుట్టిన బిడ్డను లైగర్‌ అంటారు). ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ యాక్షన్‌ రోల్‌ చేస్తున్నారు. పాత్ర కోసం మిక్డ్స్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ కూడా తీసుకున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించబోతోందని ఆమధ్య ప్రచారం జరిగింది. అయితే డేట్లు సర్దుబాటు కాకపోవడంతో ఈ సినిమా నుంచి జాన్వి తప్పుకుందని టాక్. “ఫైటర్”లో నటించబోయే హీరోయిన్ గురించి తాజాగా మరో అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో విజయ్ సరసన అనన్యా పాండేను హీరోయిన్‌గా తీసుకోవాలనుకుంటున్నారట. కరణ్ జోహార్ నిర్మించిన `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2` చిత్రంతోనే అనన్య హీరోయిన్‌గా పరిచయమైంది. నటిగానూ, గ్లామర్‌పరంగానూ తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. మరి తెలుగు ప్రేక్షకులను ఈ బ్యూటీ ఎంత మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Related posts