telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రఘురామకృష్ణరాజుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురు

Raghuramakrishnaraju ycp mp

ఎంపీ రఘురామ కృష్ణం రాజు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. జిల్లా కోర్టు వెళ్లకుండా నేరుగా హైకోర్టు కు ఎందుకు వచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. ప్రాథమిక విచారణ, ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారన్న న్యాయవాది.. ఎంపీ హోదాలో ఉన్న వ్యకిని సహేతుక కారణాలు లేకుండా రిమాండ్ కి ప్రవేశ పెట్టాలనుకోవడం చట్టవిరుద్దమని పేర్కొన్నారు. అయితే ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఎదురుదెబ్బ తగిలింది. ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ బెయిల్ కోసం సిఐడి కోర్టులో ప్రయత్నించమని ఆదేశించింది హైకోర్టు. బెయిల్ కావాలంటే కింది కోర్టును ఆశ్రయించాలని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కేసులో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. కాగా . నిన్న ఎంపీ రఘురామకృష్ణంరాజును హైదరాబాద్ లో అరెస్టు చేసిన సీఐడీ అధికారులు… గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి విచారణకోసం తరలించారు. అర్థరాత్రి ఒంటిగంట వరకూ విచారణ కొనసాగింది. విచారణ అనంతరం రఘురామకృష్ణంరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. సామాజిక వర్గాల మధ్య విద్వేషాన్ని పెంచేలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని రఘురామకృష్ణంరాజును ప్రశ్నించారు సిఐడి అధికారులు. ఎవరి ప్రోద్బలంతో ప్రభుత్వంలోని వివిధ హోదాలో ఉన్న వారిని లక్ష్యంగా చేసుకున్నారని ప్రశ్నించిన సీఐడీ అధికారులు..ప్రభుత్వ వ్యవస్థల పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లేలా ఎందుకు వ్యాఖ్యలు చేశారంటూ రఘురామకృష్ణం రాజును ప్రశ్నించారు.

Related posts