telugu navyamedia
సినిమా వార్తలు

“అల్లాద్దీన్” తెలుగు టీజర్… వెంకీ, వరుణ్ డైలాగులు అదుర్స్

Aladdin-Trailer

మనం ఇన్నిరోజులు కార్టూన్ గా చూసిన “అల్లాద్దీన్” తాజాగా మరోసారి డిస్నీవాళ్లు సినిమాగా మన ముందుకు తీసుకొస్తున్నారు. ప్రముఖ దర్సకుడు గై రిచీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యాంటసీ చిత్రంలో మెనా మస్సూద్ అలాద్దిన్ పాత్రలో, హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్ జినీగా, జాస్మిన్ యువరాణి పాత్రలో నవోమి స్కాట్, మాంత్రికుడు జఫార్ పాత్రలో మార్వాన్ కెంజారి నటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం వేసవి కానుకగా మే 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో జీనీ పాత్రను పోషించిన విల్‌స్మిత్‌కు విక్టరీ వెంకటేష్‌ డబ్బింగ్‌ చెప్పగా, అల్లాద్దీన్ పాత్రకు వరుణ్‌తేజ్‌ గొంతును అరువిచ్చారు. ఇటీవల విడుదల చేసిన మొదటి టీజర్‌కు విశేష స్పందన లభించింది. తాజాగా చిత్ర యూనిట్ మరో టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్లో “నీకు మూడు కోరికలు కోరే అవకాశం ఉంది. దీపాన్ని రుద్ది నువ్వు ఆ కోరికలు కోరడమే” అంటూ జీనీగా పాత్రకు వెంకటేష్‌ చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో భారీగా విడుదల చేయనున్నారు. మీరు కూడా ఈ టీజర్ పై ఓ లుక్కేయండి.

Related posts