telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దేనికైనా “సైరా” అంటున్న జగపతి బాబు

ఈరోజు జగపతి బాబు జన్మదినం. వీరమాచినేని జగపతి బాబు ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లో విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈరోజు జగపతి బాబు తన 57 వ పుట్టినరోజు పండుగను జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా నిర్మాత రామ్ చరణ్, జగపతి బాబు పుట్టినరోజు సందర్భంగా “సైరా నరసింహా రెడ్డి ” చిత్రంలో ని జగపతి బాబు పాత్ర గెట్ అప్ టీజర్ ను విడుదల చేశాడు. జగపతి బాబు విలన్ గా ఇప్పుడు క్షణం తీరిక లేనంత బిజీగా వున్నాడు.

1989లో జగపతి బాబు వి. మధుసూదన రావు దర్శకత్వంలో “సింహస్వప్నం” సినిమాతో హీరోగా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. మొదట్లో ఆయన గొంతు బాగాలేదని డబ్బుంగు చెప్పారు. ఆ తరువాత ఆయన గొంతు చాలా బాగుంది అన్నారు. నిర్మాత దర్శకులు వీబీ రాజేంద్ర ప్రసాద్ కుమారుడుగా పరిచయం అయినా మొదట్లో చాలా సినిమాలు నిరాచపరిచాయి. ఆ తరువాత హీరోగా క్రమంగా నిలదొక్కుకున్నారు . 2012 వరకు హీరోగా 95 సినిమాల వరకు చేశారు.

happy birth day to jagapatibabu viramachineniఏడు నంది అవార్డులు, మూడు ఫిలిం ఫేర్ అవార్డులు, మరెన్నో ప్రైవేట్ అవార్డులు, చిరస్మరణీయమైన ఎన్నో సినిమాలు. అయితేనేం హీరోగా ఇక సక్సెస్ కాలేనేమో అనుకొని కొంత నిరాశకు లోనయ్యారు . సినిమా జీవితం ఇక ముగిసిపోయిందేమో అనుకుంటున్నా తరుణంలో జగపతి బాబు జీవితం ఊహించని విధంగా మలుపు తిరిగింది. అదే “లెజెండ్” సినిమా; 2014 “లెజెండ్” సినిమాతో విలన్ గా మారిపోయాడు. అది జగపతి బాబు తీసుకున్న తెలివైన నిర్ణయం, అక్కడ నుంచి జగపతి బాబు వెనక్కు తిరిగి చూడలేదు .

తెలుగు, తమిళ , మలయాళ , కన్నడ , హిందీ చిత్రాల్లో ఎంతో బిజీగా ఉన్నాడు. నిజం చెప్పాలంటే డేట్స్ అడ్జెక్టు చేయలేనత బిజీగా ఉన్నాడు. తెలుగు సినిమా రంగంలో ఇప్పుడు విలన్ అనగానే వెంటనే గుర్తుకొచ్చే పేరు జగపతి బాబు. గత సంవత్సరం జగపతి బాబు నటించిన రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవ సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు చిరంజీవి, అమితాబ్, నయన తారతో సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో నిర్మిస్తున్న “సైరా నరసింహ రెడ్డి ” సినిమాలో వీరా రెడ్డి పాత్రలో నటిస్తున్నాడు. ఈ 30 సంవత్సరాల్లో జగపతి బాబు 120 సినిమాల్లో నటించాడు.

Related posts