ఏపీకి జరిగిన అన్యాయం సహా బీజేపీకి దేశవ్యాప్తంగా పెరిగిన అసమ్మతి ఆఖరి అస్త్రానికి సిద్ధం అవుతుంది. గతంలో అంటే, మూడు దశాబ్ధాల క్రితం 1989లో బోఫోర్స్ కుంభకోణంలో ఆరోపణల నేపథ్యంలో అప్పటి ప్రధాని రాజీవ్ మూకుమ్మడి ఎంపీల రాజీనామాలను తిరస్కరించారు. ఎన్టీఆర్ నేతృత్వంలో నేషనల్ ఫ్రంట్ ఊహించని నిరసనకు దిగారు. ఏకంగా 106 మంది 12 ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు రాజీనామా చేశారు. దాంతో లోక్‌సభలో సంక్షోభం ఏర్పడింది. ప్రస్తుతం పార్లమెంటులో ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ప్రస్తుతం రాఫెల్‌పై సంయుక్త పార్లమెంటరీ కమిటీని నియమించడానికి మోది నిరాకరించడం. ఏపికి హోదా ప్రకటించకపోవడం, దేశంలో ప్రతిపక్ష పార్టీలపై అణచివేత చర్యలకు పాల్పడడానికి నిరసనగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించాలని ప్రతిపక్ష నేతలు భావిస్తున్నారు. దీనిపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బడ్జెట్ చివరి సమావేశాల్లో రాజీనామాలు చేస్తే ఎంత మేరకు ప్రభావం ఉంటుంది. అనే అంశంపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అప్పటికంటే ఎక్కువ మంది అంటే దాదాపు 10 పార్టీలకు చెందిన 120 మంది ఎంపీలు రాజీనామాకు సిద్ధపడవచ్చని రాజకీయ పరిశీలకులు భావస్తున్నారు. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్లినా మోడీ గ్రాఫ్ పై పెద్దగా ప్రభావితం కాదని, అదికూడా మేలు చేస్తుంది తప్ప ఒరిగేది ఏమిలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు ఎంత త్వరగా జరిగితే బీజేపీకి అంత మంచిదని వారు అనడం విశేషం.
తండ్రీ కొడుకులు శూన్య తెలంగాణ చేస్తున్నారు: వివేక్