telugu navyamedia
సినిమా వార్తలు

‘హరి హర వీరమల్లు’ షూటింగ్ అప్డేట్

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా క్రిష్‌ జాగర్లమూడి డైరెక్షణ్‌లో తెరకెక్కుతోన్న పీరియాడికల్‌ చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఎ.ఎం. రత్నం సమర్పణలో ఎ.దయాకర్‌ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే కొద్దిభాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత పునః ప్రారంభంకానుంది. ఈ మేరకు హీరో పవన్‌ కల్యాణ్‌, దర్శకనిర్మాతలు సమావేశమయ్యారు. తదుపరి షెడ్యూల్స్‌ చిత్రీకరణ గురించి చర్చించారు. త్వరలోనే షూటింగ్‌ మొదలుపెట్టనున్నట్టు తెలిపారు.

పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్టు 2022 ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకురానుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా త్వరితగతిన పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ కథ ఇది. ఈ సినిమా కి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. బుర్రా సాయిమాధవ్‌ సంభాషణలు అందిస్తున్నారు.

పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఏక కాలంలో విడుదల చేయనున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ – హిందీ నటుడు అర్జున్ రామ్ పాల్ – మలయాళ నటుడు జయరామ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు.. పవన్‌ కల్యాణ్‌ ‘భీమ్లా నాయక్‌’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకి సాగర్‌ కె. చంద్ర దర్శకుడు. ఇవి పూర్తయ్యాక హరీశ్‌ శంకర్ దర్శకత్వంలో, సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో నటించనున్నారు.

Related posts